Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy : కేసీఆర్ బూతుల రోగం అసద్‌కి అంటుకుందా..?

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRS‌లకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో పాల్గొనని పార్టీలకు అంబేద్కర్‌ను వాడుకునే హక్కేంటని ప్రశ్నించారు. BRS, కాంగ్రెస్ పార్టీలు AIMIMకు లొంగిపోయాయా అని చురకలు వేశారు. ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రధాని మోదీపై వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని, ఆయన్ను కూడా కేసీఆర్ బూతుల రోగం పట్టిందా అంటూ తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్‌లో హిందూ దళితుల కోసం CAA వేదన గురించి అంబేద్కర్ ముందే ఊహించారని, ఆయన ఆచరించిన సిద్ధాంతాలను ఈ మూడు పార్టీలకు చెప్పే అర్హత లేదన్నారు.

వక్ఫ్ బిల్లు మతానికి సంబంధించి కాదని, ఇది దేశ ప్రయోజనాల కోసం అవసరమైందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా AIMIM, కాంగ్రెస్ పార్టీల వ్యవహారం ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటు వేయాలని, పార్టీలు పక్కన పెట్టి దేశభక్తితో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో లేకపోతే కేటీఆర్ ఏమన్నా మాట్లాడతారో అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థమైతే చాలు అన్నారు.

Nitesh Rane: ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ పర్మిషన్ తీసుకున్నాడా..? రాజ్ వ్యవహారంపై బీజేపీ నేత..

Exit mobile version