Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Metro Rail Offerings This Ugadi Super Saver Metro Holiday Card Super Off Peak Hour And Metro Student Pass

Hyderabad Metro Rail: హైదరాబాదీలకు మెట్రో ఉగాది కానుక.. నేటి నుంచి మూడు ఆఫర్లు..

Published Date :April 9, 2024 , 10:26 am
By Sudhakar Ravula
Hyderabad Metro Rail: హైదరాబాదీలకు మెట్రో ఉగాది కానుక.. నేటి నుంచి మూడు ఆఫర్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad Metro Rail: ఉగాది సందర్భగా హైదరాబాదీలకు శుభవార్త చెప్పింది హైద‌రాబాద్ మెట్రో రైలు.. ఈ రోజు నుంచి మూడు ప్రత్యేక ఆఫర్లు మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఉగాది సందర్భంగా నేటి నుంచి ఆ మూడు ఆఫర్లు మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ప్రకటించారు.. మెట్రో ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు నేటి నుంచి 6 నెలల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి..

ఇక, కొత్త మూడు ఆఫర్లపై హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు కోసం ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ సరికొత్తగా కస్టమర్‌ లాయల్టీ ప్రోగ్రాంను పరిచయం చేస్తుందని పేర్కొన్నారు.. ఇవి మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో వెసులుబాటు కల్పిస్తాయని.. ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే ఎక్కువ రివార్డులు పొందవచ్చు అని వెల్లడించారు.. మరోవైపు.. కొత్తగా ప్రారంభించిన కస్టమర్‌ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా మెట్రో ప్రయాణికులు ఎంతో లబ్ధి పొందుతారని చెప్పుకొచ్చారు ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి.. ప్రయాణికుల నుంచి వస్తుందన్న స్పందన, అభ్యర్థనలతో ఈ ఉగాది రోజున మేం ఈ ఆఫర్‌లను తిరిగి పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. మేం సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ మరియు మెట్రో స్టూడెంట్ పాస్‌లను మళ్లీ ప్రారంభించినందున, ఏప్రిల్ 9, 2024 నుంచి అంటే ఇవాళ్టి నుంచి 6 నెలల వరకు ఈ ఆఫర్‌లను పొందవచ్చు.. మీరు మాతో ప్రయాణిస్తున్నప్పుడు అసాధారణమైన పొదుపులు మరియు సౌకర్యాన్ని పొందుతారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు..

మొత్తంగా ‘సూపర్ సేవర్ హాలిడే కార్డ్’ చెల్లుబాటును మరో ఆరు నెలల పాటు పొడిగించింది.. అంటే మెట్రో ప్రయాణికులు ఏ సెలవు దినమైనా రూ.59కే ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, ‘స్టూడెంట్ పాస్‌ల’ చెల్లుబాటును మరో ఆరు నెలల పాటు పొడిగించారు. HMRL తన ‘సూపర్ ఆఫ్-పీక్ ఆఫర్’ ఆఫర్ ద్వారా రద్దీ లేని సమయాల్లో ప్రయాణంపై 10 శాతం తగ్గింపును ప్రకటించింది. కాగా, HMRL మార్చి 31న ఈ అన్ని కార్డుల ప్రయోజనాలకు స్వస్తి చెప్పింది.. అయితే, మెట్రో వినియోగదారుల నుండి వచ్చిన విజ్ఞప్థులతో ఉగాది కానుకగా ఈ ప్రత్యేక ప్రయాణ తగ్గింపులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Due to the overwhelming response and your request we're delighted to reintroduce our highly requested offerings this Ugadi. Mark your calendars for April 9th, 2024, as we relaunch the Super Saver Metro Holiday Card, Super Off Peak Hour, and Metro Student Pass. Avail these offers… pic.twitter.com/vjXOtbDLjD

— L&T Hyderabad Metro Rail (@ltmhyd) April 9, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Hyderabad metro rail
  • Metro Student Pass
  • Super Off Peak Hour
  • Super Saver Metro Holiday Card

తాజావార్తలు

  • Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

  • Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

  • Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions