Site icon NTV Telugu

Money Laundering Scam: CBI ముసుగులో 79 ఏళ్ల వ్యక్తి నుండి రూ.35.74 లక్షలు దోపిడీ..!

Cyber Crime 1

Cyber Crime 1

Money Laundering Scam: రోజురోజుకు సమాజంలో ఆర్ధిక నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు అన్ని విధాల ఈ ఆర్ధిక నేరాలకు సంబంధించి అలర్ట్ చేస్తున్న ప్రజలు మాత్రం సైబర్ నేరాల ఉచ్చులో నుంచి బయటకి రాలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ దోపిడీ విషయం బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

బాధితుడు హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో నివసిస్తున్న 79 ఏళ్ల వ్యక్తి CBI ముసుగులో దోపిడీ స్కామ్‌కు గురయ్యాడు. జూలై 6, 2025న బాధితుడికి CBI అధికారిగా ఉన్న విజయ్ ఖన్నా అని చెప్పుకునే వ్యక్తి నుండి కొలాబా పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది. బాధితుడి పేరు మీద ఉన్న కెనరా బ్యాంక్, కొలాబా బ్రాంచ్‌లోని బ్యాంకు ఖాతా, నరేష్ గోయెల్ అనే నిందితుడికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉందని మోసగాడు తప్పుడు ఆరోపించాడు. ఈ కారణంగా.. భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతోందని చెప్పి బాధితుడిని బెదిరించారు.

Rajagopal Reddy: అందుకే మునుగోడు నుంచి పోటీ చేశా.. రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

బాధితుడికి నమ్మకాన్ని కలిగించేలా.. కోర్టు ఆదేశాలు, CBI వారెంట్లు (FIR నంబర్ MH/15621/0225) వంటి నకిలీ పత్రాలను కూడా షేర్ చేశారు. జాతీయ భద్రత, ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని పేర్కొంటూ బాధితుడిని ఎవరికీ ఈ విషయాన్ని వెల్లడించవద్దని హెచ్చరించారు. దీనితో భయం, మోసంతో మోసపోయిన బాధితుడు తన బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తానని తప్పుడు హామీతో తన డబ్బును “ధృవీకరణ” కోసం బదిలీ చేయమని చెప్పారు. దానితో పది రోజుల వ్యవధిలో బాధితుడు మొత్తం రూ.35,74,094 మొత్తంను మోసగాళ్ళు అందించిన ఖాతాలకు బదిలీ చేశాడు.

Honda CB125 Hornet: డిజైన్, కంఫర్ట్, సేఫ్టీ.. అన్నీ ఒకే బైక్‌లో! కొత్త హోండా Shine 100 DX వచ్చేసింది..!

అంతేకాదు.. ఆయుష్ గుప్తా, దర్యాప్తు అధికారి అని నటిస్తూ మరొక వ్యక్తి కూడా బాధితుడిపై బదిలీలు చేయమని ఒత్తిడి చేశాడు. చివరికి, అనుమానితుల జాబితా నుండి తన పేరు తొలగించబడిందని.. సమీపంలోని క్రైమ్ బ్రాంచ్ నుండి తన డబ్బును సేకరించమని సూచించారు. ఆ మాటలతో బాధితుడు హైదరాబాద్‌ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించదాంతో తాను మోసపోయానని కనుగొన్నాడు.

Exit mobile version