Hyderabad: రూ.3 వేల లోన్‌కే న్యూడ్ ఫోటోలతో బెదిరింపులు.. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి

Suicide

Suicide

Hyderabad: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ రాంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. లోన్‌ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు.. కేవలం మూడువేల రూపాయల లోన్ కట్టాలని నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. న్యూడ్ ఫోటోలు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తాళలేక ప్రేమ్‌కుమార్ (36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య నాగవేణి తెలిపిన ప్రకారం.. ఫోన్‌లో యాప్‌ ద్వారా లోన్ తీసుకున్న బాధితుడు ప్రేమ్‌కుమార్.. ఫోన్ కాల్స్ చేసిన లోన్ ఏజంట్లు కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో ఏం మనస్తాపానికి గురైన బాధితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

READ MORE: Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!