KTR: ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఇందులో భాగంగా మంత్రి కెటిఆర్‌తో ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Read Also: Jharkhand: లవర్‌తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం
కంపెనీ యజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్లాండ్ ఫార్మా రావడం వల్ల రాష్ట్ర లైఫ్ సైన్సెస్ జీనోమ్ వ్యాలీల శక్తి మరింత బలోపేతమవుతోందన్నారు. బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్,రీకాంబినెంట్ ఇన్సులిన్ వంటి అధునాతన రంగాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి గ్లాండ్ ఫార్మా నిరంతరం కృషి చేస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ భారతదేశంలో దాదాపు 1,000 మిలియన్ యూనిట్ల పూర్తి ఫార్ములేషన్ సామర్థ్యంతో ఎనిమిది తయారీ కేంద్రాలను నిర్వహిస్తోందన్నారు.
Read Also: Maoist Warning: కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టుల వార్నింగ్..