NTV Telugu Site icon

Physical Harassment: జర్మన్ యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్‌

Harassment

Harassment

Physical Harassment: హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారయత్నం చేసిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌ వచ్చి, నగరాన్ని సందర్శిస్తున్న జర్మన్ యువతి, యువకుడు ఇద్దరూ స్నేహితుల వద్ద ఉండి అక్కడి ప్రదేశాలను చూస్తూ తిరుగుతున్నారు. అయితే.. నిన్న మార్కెట్‌ చూసేందుకు జర్మన్ యువతి, యువకుడు బయటకు వచ్చారు. మీర్‌పేట్ సమీపంలో జర్మన్ యువతి, యువకుడిని అస్లాం, అతడి స్నేహితులు చూశారు. నగరాన్ని చూపిస్తానని నమ్మించి జర్మన్‌ యువతి, యువకుడిని కారులో ఎక్కించుకున్నారు అస్లాం. జర్మన్ యువతి, యువకుడిని సెల్ఫ్‌డ్రైవ్‌ కారులో పలు ప్రాంతాల్లో తిప్పిన అస్లాం… నిన్న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు రోడ్డువైపు కారును మళ్లించాడు. ఈ క్రమంలోనే ఫొటోలు దిగేందుకు కారు నుంచి అస్లాం స్నేహితులు, జర్మన్ యువకుడు దిగారు. కారు యూటర్న్ చేసుకొద్దామని జర్మన్‌ యువతిని కారులో తీసుకెళ్లిన అస్లాం… కారును నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడి నుంచి తప్పించుకున్న బాధిత యువతి… తన స్నేహితుడితో కలిసి ఫహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్మన్ యువతి ఫిర్యాదు మేరకు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Yogi Adityanath: ‘‘మోడీ తర్వాత ప్రధాని యోగి ఆదిత్య నాథ్.?’’ ఆయన ఏమన్నారంటే..