Fire Accident : అబిడ్స్‌లోని క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం…
- అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం
- మయూర్ పాన్‌షాపు దగ్గరలోని క్రాకర్స్ షాపులో అగ్నిప్రమాదం
- భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- క్రాకర్స్‌కు అంటుకోవడంతో భారీగా వ్యాపిస్తున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : హైదరాబాద్‌లోని అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత బొగ్గులకుంటలోని మయూర్ పాన్‌షాపు వద్దనున్న క్రాకర్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుకాణంలో మంటలు చెలరేగడంతో, పక్కనే ఉన్న హోటల్లకు వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరియు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీపావళి పండగ సీజన్, ఆదివారం కావడంతో జనం రోడ్లపై షాపింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినందువల్ల అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు 5 ఫైరింజన్లు రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల ధాటికి అక్కడే ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి.
AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే
Also Read
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ఈ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణసంచా దుకాణంలో ఎక్కువగా బాణాసంచా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. పేలిన పటాకులు పక్కనున్న దుకాణాలకు, అక్కడ పార్క్ చేసిన వాహనాలకు పడటంతో వాటికీ మంటలు అంటుకున్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పుడూ సూచిస్తున్నా, కొంతమంది వ్యాపారులు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం, పోలీసుల మరియు ఫైర్ సిబ్బంది ఉన్న బాణసంచా దుకాణాలు నియమాలు పాటించాలనే విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
Anantham Teaser: లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!