NTV Telugu Site icon

Fire Accident : అబిడ్స్‌లోని క్రాకర్స్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం…

Fire Accident Abids

Fire Accident Abids

Fire Accident : హైదరాబాద్‌లోని అబిడ్స్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత బొగ్గులకుంటలోని మయూర్‌ పాన్‌షాపు వద్దనున్న క్రాకర్స్‌ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుకాణంలో మంటలు చెలరేగడంతో, పక్కనే ఉన్న హోటల్‌లకు వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరియు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీపావళి పండగ సీజన్, ఆదివారం కావడంతో జనం రోడ్లపై షాపింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినందువల్ల అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు 5 ఫైరింజన్లు రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల ధాటికి అక్కడే ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి.

AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే

ఈ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాణసంచా దుకాణంలో ఎక్కువగా బాణాసంచా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. పేలిన పటాకులు పక్కనున్న దుకాణాలకు, అక్కడ పార్క్ చేసిన వాహనాలకు పడటంతో వాటికీ మంటలు అంటుకున్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పుడూ సూచిస్తున్నా, కొంతమంది వ్యాపారులు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం, పోలీసుల మరియు ఫైర్ సిబ్బంది ఉన్న బాణసంచా దుకాణాలు నియమాలు పాటించాలనే విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Anantham Teaser: ల‌వ్ స‌స్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్

 

Show comments