Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!

  • గచ్చిబౌలిలో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అగ్నిప్రమాదం
  • ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ప్రారంభం
  • 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం
  • అపార్ట్‌మెంట్ అంతా దట్టమైన పొగ
  • పొగ పీల్చడంతో ఇద్దరు నివాసితులకు అస్వస్థత..
Fire Accident

Fire Accident

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టిఎన్జీవో కాలనీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ప్రాణనష్టం తప్పింది.

స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

ప్రాథమిక సమాచారం ప్రకారం, అపార్ట్‌మెంట్ సెల్లార్‌ లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు మొదలయ్యాయి. సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు ఈ మంటలు వేగంగా అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్మెంట్ అంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. పొగ కారణంగా పై అంతస్తుల్లో ఉన్న నివాసితులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

TGSRTC Strike Alert: 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించనున్న RTC ఉద్యోగులు.. సమ్మెను లైట్ తీసుకున్న ప్రభుత్వం.?

ఈ అగ్నిప్రమాద ఘటనలో సెల్లార్‌ లో పార్క్ చేసిన సుమారు 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పొగ పీల్చడం వల్ల అపార్ట్మెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే గచ్చిబౌలి ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ లోపల చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. నిచ్చెనల సాయంతో పై అంతస్తుల నుంచి బాధితులను సురక్షితంగా కిందకు దించారు. అగ్నిమాపక యంత్రాలతో నీటిని చల్లి మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అపార్ట్‌మెంట్ వాసులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు.