Site icon NTV Telugu

Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు.. 10 నెలల తర్వాత ఇలా..

Daughgere

Daughgere

ఇంటి క్రిమినల్‌ను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. హైదరాబాద్ జవహర్‌నగర్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమ వ్యవహారానికి అడ్డు తగిలిన తల్లిని.. కన్నకూతురే అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి చంపేసింది. అంతే కాదు..ఏకంగా ఆ విషయాన్ని 10 నెలలపాటు దాచి పెట్టింది. ఏం తెలియనట్టు డ్రామా రక్తి కట్టించింది ఆ కసాయి కూతురు. కానీ చివరికి విషయం బయటపడడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఆ కసాయి కూతురు ఎవరు? ఈ కేసులో అసలేం జరిగింది?

ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు ఇషిక. మరో ఫోటోలో ఉన్న మహిళ పేరు అంజు. వీరిద్దరూ తల్లీకూతుళ్లు. జవహర్‌నగర్‌ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో ఉంటున్నారు. అంజు పెద్ద కుమార్తె పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. చిన్న కుమార్తె ఇషికతో కలిసి అంజు నివాసం ఉంటోంది. కొద్ది రోజులుగా ఇషిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. అదే సమయంలో సుమారు 10 నెలల క్రితం అంజు కనిపించకుండా పోయింది. దీంతో కుుటంబ సభ్యులు అంతా ఆందోళన చెందారు. చాలా చోట్ల వెతికినా కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇషిక సైతం మిగతా కుటుంబ సభ్యుల ముందు తల్లి కోసం డ్రామా ఆడింది. తనకేం తెలియనట్లు ప్రవర్తించింది. అంతే కాదు కుటుంబ సభ్యులకు పలు రకాలుగా వివరణలు చెబుతూ దర్యాప్తును కూడా తప్పుదోవ పట్టించింది. ఇటీవల అంజు పేరిట ఉన్న వాహనాన్ని అమ్మేందుకు ఇషిక ప్రియుడు తీసుకువెళ్లాడు. ఆ వాహనాన్ని కొనుగోలు చేసే వ్యక్తి పలు ప్రశ్నలు అడిగాడు. ఐతే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించగా అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

Also Read:Central Cabinet: గుడ్ న్యూస్.. మరో 3 పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..

ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇషికపై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు సమాధానాల ఆధారంగా క్లూస్ టీమ్ సాయంతో ఇంట్లో తవ్వకాలు ప్రారంభించారు. దీంతో ఇంట్లోనే పాతిపెట్టిన తల్లి అంజు శవం బయటపడింది. దీంతో మరింత లోతుగా విచారణ చేయడంతో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇషిక తరచూ తన ప్రియులను ఇంటికి తీసుకు వచ్చేదని తేలింది. దీనిపై అంజు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూతురును మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని ఇషిక.. ఏకంగా కన్న తల్లినే చంపేసేందుకు స్కెచ్చేసింది. ఈ క్రమంలో ప్రియుడు మౌంటీరాజ్‌తో కలిసి కుట్ర పన్నింది. ఇంట్లోనే ఆమెను చంపేశారు. డెడ్‌బాడీ బయటకు తరలిస్తే .. దొరికిపోతామని భావించి.. ఇంట్లోనే గొయ్యి తవ్వి శవాన్ని పాతి పెట్టారు. యధావిధిగా మళ్లీ టైల్స్‌ వేసేశారు. ఏం తెలియనట్లు తల్లి కనిపించడం లేదని ఇషిక డ్రామాలు ఆడింది.

ఈ ఘటనపై పోలీసులు చిన్న కూతురుతోపాటు, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతేడాది మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కేసును సీరియస్‌గా తీసుకోలేదని మిగతా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కన్న తల్లినే చంపేసిన ఇషికను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version