Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Reedy Scene: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కావడానికి ముందు కథా చర్చల సమయంలో ఎదురైన విచిత్రమైన అనుభవాలను సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తాజాగా NTV పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ కథను సిద్ధం చేసుకుని సినిమా తీయడానికి దాదాపు 6 నుండి 7 ఏళ్ల పాటు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో చాలామంది నిర్మాతలు, నటీనటులకు కథను వినిపించారు. సినిమా ప్రారంభంలో తీవ్రమైన నిరాశ, విరహంలో ఉన్న హీరో (అర్జున్ రెడ్డి) తన కోరికను చల్లార్చుకోలేక ప్యాంటులో ఐస్ ముక్కలు (Ice cubes) వేసుకునే ఒక బోల్డ్ సీన్ ఉంటుంది. సినిమా కథ నెరేషన్ ఇచ్చేటప్పుడు ఈ సీన్ (ఐస్ వేసుకునే సీన్) రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేక “ఇక కథ ఆపేయండి.. మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు” అని నెరేషన్ మధ్యలోనే ఆపేయమనేవారని తెలిపారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & బోల్డ్ క్యారెక్టరైజేషన్‌ను ఎవరూ చూడలేదు. దీంతో చాలామంది ఈ సీన్స్ చూసి రిస్క్ చేయడానికి భయపడి వెనకడుగు వేశారు. కానీ సందీప్ రెడ్డి తన కథ, పాత్రల తీరుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. బయట నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో, చివరకు వారి కుటుంబానికి చెందిన మామిడి తోటను అమ్మి, భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా నిర్మించారు. ఆ తర్వాత థియేటర్లలో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, ఇండియన్ సినిమాలో ఎలాంటి ట్రెండ్‌ను సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఏ సీన్ చూసి కథనే వినడానికి నిరాకరించారో, అదే నేచురల్ అండ్ బోల్డ్ అప్రోచ్ సందీప్ రెడ్డి వంగాను నేడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా నిలబెట్టిందని ప్రణయ్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?