Site icon NTV Telugu

Crime News: అయ్యప్ప మాలలో ఉండి.. భార్యను హత్య చేసిన భర్త!

Man Kills Neighbour

Man Kills Neighbour

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప సింగారం గ్రామంలో భార్య నిహారిక (35)ను భర్త శ్రీకర్ రెడ్డి బండ రాయితో తలపై కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉండడం విశేషం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిహారిక బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

బోడుప్పల్ టెలీఫోన్ కాలనీకి చెందిన నిహారికకు 2017లో ఖమ్మం జిల్లా తిరమలపాలెం మండలం కాకరై గ్రామానికి చెందిన బండారు శ్రీకర్ రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు. నిహారికకు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఓ ఇల్లు కొనిచ్చారు. ఆ ఇల్లు విషయంలో ఇద్దరికీ పలుమార్లు ఘర్షణ జరిగేది. తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన ఇల్లు అని నిహారిక అనడంతో గొడవ జరిగేది.

Also Read: Harish Rao: పెండింగ్ వేతనాలు చెల్లించి.. ఆర్పీల జీవితాల్లో వెలుగులు నింపండి!

సోమవారం రాత్రి కూడా నిహారిక, శ్రీకర్ రెడ్డి మధ్య ఇంటి సంభాషణ వచ్చింది. దాంతో భార్య, భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉన్నా.. సహనం కోల్పోయాడు. నిహారిక తలపై బండ రాయితో కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. భర్తపై భార్య డామినేషన్ ఈ హత్యకు దారి తీసింది అని తెలుస్తోంది.

Exit mobile version