NTV Telugu Site icon

Hyderabad: ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం!

Rape

Rape

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని కేకలు విన్న పక్క గదిలోని నలుగురు విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని మంగల్‌పల్లి గేట్‌ వద్ద ఓ స్థిరాస్తి వ్యాపారికి చెందిన ప్రైవేట్‌ వసతి గృహంలో ఉంటోంది. వసతి గృహం కింద స్థిరాస్తి ఆఫీస్‌ ఉండగా.. పై అంతస్తులో బాలికల వసతిగృహం ఉంది. చివరి అంతస్తులో బుధవారం రాత్రి వ్యాపారి స్నేహితుడి జన్మదిన వేడుకలు జరిగాయి. రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్‌ (22) వసతి గృహంలో ఒంటరిగా ఉంటున్న విద్యార్థిని గదిలోకి వెళ్లి అత్యాచారం చేశాడు.

Also Read: Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!

విద్యార్థిని గట్టిగా కేకలు వేయడం పక్క గదిలోని వారికి వినిపించాయి. పక్క గదిలోని నలుగురు విద్యార్థులు తలుపునకు గడియ పెట్టి.. 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు హుటాహుటిన వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అజిత్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. అజిత్‌ గతంలో వసతిగృహం యజమాని వద్ద కారు డ్రైవర్‌గా పని చేశాడని, వసతి గృహంలో సైతం ఉండేవాడని తెలిసింది. స్థిరాస్తి వ్యాపారిని కూడా పోలీసులు విచారించారు.