Site icon NTV Telugu

Boy Rape: ఉప్పల్‌లో దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య!

Boy Rape Uppal

Boy Rape Uppal

5-Year-Old Boy Found Dead in Uppal: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాందుడు అభంశుభం తెలియని ఐదేళ్ల బాలుడిని అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు. ఈ నెల 12న (గురువారం) బాలుడు కనిపించకుండా పోగా.. శుక్రవారం మృతదేహం లభించింది. కామాందుడిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సికింద్రాబాద్ గాంధీకి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

Also Read: Telangana Weather Forecast: నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ!

రామంతాపూర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలుడి కుటుంబం నివాసం ఉంటోంది. బాలుడి తండ్రి ఓ టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. అదే టింబర్ డిపోలో నిందితుడు కూడా పని చేస్తున్నాడు. ఈ నెల 12న బాలుడు కనిపించకుండా పోవడంతో.. తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బాలుడి కుటుంబానికి సమీపంలో ఉంటున్న బిహార్‌కు చెందిన కమర్‌ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం చెప్పాడు. బాలుడికి మాయమాటలు చెప్పి సమీపంలోని చెట్ల పొదల్లో అత్యాచారం చేసి, హత్య చేసినట్టు అంగీకరించాడు. స్పృహ తప్పిపోయిన బాలుడిని నిందితుడు గొంతు నులిమి చంపాడు. పోలీసులు కమర్‌పై కేసు నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version