NTV Telugu Site icon

CP Srinivas Reddy: గుజరాత్‌లో 10 రోజుల పాటు ఆపరేషన్‌.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్

Hyderabad Cp

Hyderabad Cp

Hyderabad CP Srinivas Reddy: సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్‌లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఇందులో 20 కేసుల్లో నిందితులు సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా మోసం చేశారని తెలిపారు. ఇందులో గతంలో 4.4 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశామని.. ఫ్రీజ్ చేసిన డబ్బులో ఇప్పటికే బాధితులకు ఒకటిన్నర కోట్లు రీఫండ్ చేశామన్నారు. నిందితులు చేసిన నేరాల్లో 11 ఇన్వెస్ట్మెంట్ మోసాలు ,4 ఇన్వెస్ట్మెంట్ , నాలుగు ఫెడెక్స్, ఒకటి ట్రేడింగ్ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల వద్ద నుంచి 38 లక్షల నగదు బంగారం ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ చెక్ బుక్స్, పాస్ బుక్స్ సీజ్ చేశామన్నారు. షెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను కూడా సీజ్ చేశామన్నారు. నిందితులపై తెలంగాణ వ్యాప్తంగా సుమారు 150 కేసులు ఉన్నాయన్నారు.

Read Also: HYDRA Commissioner: చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశాం..

హైదరాబాద్‌ నగరంలో నిందితులు చేసిన మూడు మేజర్ క్రైమ్స్ ఉన్నాయన్నారు. ట్రేడింగ్ పేరిట చేసిన మోసాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని.. ఇందులో కనాని నికుంజ్ కిషోర్ భాయ్ అనే చార్టెడ్ అకౌంట్ ఉన్నాడని సీపీ తెలిపారు. ప్రవీణ్ భాయ్‌తో పాటు మరో నిందితుడి ద్వారా చార్టెడ్ అకౌంటెంట్ ఈ నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ముందుగా నిందితులు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రాంలో లింక్ సెండ్ చేస్తారని.. అందులో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో మోసం చేశారన్నారు. నిందితులు బాధితుడి నుంచి 61 లక్షలు కాజేశారన్నారు. బాధితుడి నుంచి ముందుగా కొంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరిట పెట్టుబడి పెట్టించారని.. ముందుగా పెట్టుబడి పెట్టిన డబ్బుకు కొంత లాభాలు ఇచ్చారని.. అనంతరం డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేశారని.. ఫోన్లు ఆపేశారని సీపీ తెలిపారు. బాధితుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశామని ఆయన పేర్కొన్నారు. ముగ్గురు నిందితులపై 142 ఫిర్యాదులు ఎన్సీఆర్‌పీలో నమోదు అయ్యి ఉన్నాయన్నారు. వీరి వద్ద నుండి మొబైల్, బ్యాంక్ డెబిట్ కార్డ్స్,పాస్ బుక్‌లు సీజ్ చేశామన్నారు.

Read Also: Harish Rao : బీఏఎస్ పథకానికి నిధులు విడుదల చేయాలి

మరో కేసులో నిందితులు ఫెడెక్స్ పేరిట ఫ్రాడ్‌కు పాల్పడ్డారని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఫెడెక్స్ ఫ్రాడ్‌లో బాధితులను రకరకాలుగా బెదిరించి డబ్బులు కాజేశారన్నారు. ఈ కేసులో ఒక వృద్ధురాలైన డాక్టర్‌ను నిందితులు మోసం చేశారని సీపీ తెలిపారు. నిందితులు ఆమెకు ఫోన్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశామని నిందితులు ఫోన్‌ చేసి బెదిరించారు. విచారణకు రావాలని ఫేక్ ఎఫ్‌ఐఆర్‌, నకిలీ ఆర్బీఐ లెటర్, సీబీఐ లెటర్లు పంపించారు. అరెస్టు కాకుండా ఉండాలంటే తాము చెప్పిన డబ్బు పంపాలని అడిగారు. దీంతో నిందితులు చెప్పిన ఖాతాకు ఒక కోటి ఆరు లక్షల రూపాయలు బాధితురాలు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మొత్తాన్ని రెండు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం తనను బెదిరించింది ఫేక్ పోలీసులు అని తెలుసుకుని కంప్లైంట్ చేసింది. జులైలో నమోదు చేసిన ఈ కేసులో ముగ్గురు నిందితులు ఉండగా.. ఇద్దరిని అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. సాగర్ ప్రజాపతి, నాథో భాయ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. పది లక్షలు రూపాయలు పాస్ బుక్‌లు నకిలీ షెల్ కంపెనీల స్టాంపులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Read Also: Ganesh Navaratri : గణేష్ చతుర్థి సందర్భంగా అంతర్ శాఖల సమన్వయ సమావేశం

మరో కేసులో ఇన్వెస్ట్మెంట్ నిందితులు పేరిట మోసాలకు పాల్పడ్డారని సీపీ శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. తాము చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయనీ నమ్మించి మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ముందుగా ఆరు, ఏడు సార్లు కొంత లాభాలు ఇచ్చి ఆపై పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టగానే డబ్బులు ఇవ్వకుండా మోసగించారు..ఈ కేసులో రామ్‌కోటికి చెందిన ఓ వ్యాపారస్తుడిని మోసం చేసి రెండు కోట్లు కొట్టేశారు. రామ్ కోటికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గుజరాత్ కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కేసులో కీలక నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరామన్నారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తామన్నారు. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలనుకున్నామని.. కానీ బ్లూ కార్నర్ నోటీస్‌తో యూఎస్ గవర్నమెంట్ వ్యక్తులను మనకి హ్యాండ్ ఓవర్ చేయదన్నారు. కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌కి విజ్ఞప్తి చేశామన్నారు. సీబీఐ డైరెక్టర్‌కి పూర్తిగా కేసు వివరాలు అర్థమయ్యాయన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని ఆయన తెలిపారు.