NTV Telugu Site icon

HYD CP CV Anand: ఏడాదిలో 7.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. గోషామహల్ స్టేడియంలో డిస్రక్షన్

Cv Anand

Cv Anand

గోషామహల్ స్టేడియంలో నార్కోటిక్స్ వింగ్ ద్వారా పట్టుబడ్డ డ్రగ్స్ డిస్రక్షన్ కార్యక్రమం చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. NDPS ఆక్ట్ ప్రకారం నిబంధనలు మేరకు వీటిని సీజ్ చేశామన్నారు. 2,140 కేజీల గంజాయి, 3.8 కేజీల మహకల్ మాదకద్రవ్యాలు, 12669ఎంఎల్ హాష్ ఆయిల్, 540 అల్ప్రోజోళం టాబ్లెట్స్, 19.34 గ్రాముల కొకైన్, 4LSD బాటిల్స్, 177.75 గ్రాముల MDMA , 70గ్రాముల ఒపియం పట్టుకున్నట్లు వివరించారు. నిందితులపై 208 కేసులు నమోదు చేసి.. వీటిని సీజ్ చేసినట్లు తెలిపారు. వీటన్నిటి విలువ 7.5 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు.. ఈ ఏడాది పట్టుకున్న మొత్తం పట్టుకున్న డ్రగ్స్ నీ ధ్వంసం చేయబోతున్నట్లు చెప్పారు. గత మూడేళ్లుగా 1200 కేసులు నమోదు అయ్యాయని.. పట్టుకున్న మాదక ద్రవ్యాలను మళ్ళీ ఎక్కడ వినియోగించకుండా ధ్వంసం చేశామన్నారు. సీఎం రేవంత్ డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని గుర్తుచేశారు..

READ MORE: Pushpa 2: ఆశీస్సుల కోసం మెగాస్టార్ నివాసానికి మైత్రీ నిర్మాతలు

యువత చెడు పోకడలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని సీపీ తెలిపారు. “ఈ డ్రైవ్ రానున్న రోజుల్లో కొనసాగిస్తాం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ నీ కట్టడి చేస్తున్నాం.. సప్లై రూట్ లను డిటెక్ట్ చేస్తున్నాం.. రెండు నెలలుగా ఈ డ్రగ్స్ ఇష్యూస్ తగ్గుముఖం పట్టాయి.. అవగాహన కల్పిస్తున్నాం…” అని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

READ MORE:Telangana News: కాళేశ్వరం లేకున్నా.. ధాన్యం దిగుబడిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ..

Show comments