Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘోర ప్రమాదం ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలితీసుకుంది. రాజేంద్రనగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ మొహిద్దీన్ హుస్సేని (30) సరదా కోసం చేసిన ఒక చిన్న పొరపాటు, ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. కేవలం నవ్వులాట కోసం అత్యంత విషపూరితమైన పామును చేతుల్లోకి తీసుకోవడం, ఆపై జరిగిన పరిణామాలు ఈ విషాదానికి దారితీశాయి.
రెండు రోజుల క్రితం సయ్యద్ మొహిద్దీన్ తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో, తెల్లవారుజామున ఒక చిన్న కట్లపాము (Common Krait) ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించింది. చిన్నగా ఉన్న ఆ పామును చూసి, అది ప్రమాదకరం కాదని సయ్యద్ భావించాడు. సరదాగా దాన్ని చేతిలోకి తీసుకుని, అక్కడున్న స్నేహితులందరినీ భయపెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆ కట్లపాము సయ్యద్ కుడిచేతిపై బలంగా కాటేసింది. అయితే, విషసర్పాల తీవ్రతపై అవగాహన లేకపోవడంతో, తనకు ఏమీ కాదంటూ సయ్యద్ స్నేహితుల ముందు నవ్వుతూ తేలికగా తీసుకున్నాడు. కానీ, కట్లపాము అత్యంత ప్రమాదకరమైన న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగి ఉంటుందనే నిజాన్ని గ్రహించలేకపోయాడు. కాసేపటికే సయ్యద్ శరీరంలో మార్పులు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆందోళన చెందిన స్నేహితులు ఆయన్ను తక్షణమే హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వైద్యులు శ్రమించినప్పటికీ, అప్పటికే విషం శరీరామంతటా పాకడంతో చికిత్స పొందుతూ సయ్యద్ మొహిద్దీన్ హుస్సేని కన్నుమూశాడు. ఈ ఘటనతో సయ్యద్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!