Hydera Commissioner Ranganath: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydera Commissioner Ranganath Faces Contempt Case: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈరోజు కోర్టు ముందు హాజరు కానున్నారు. పలు కంటెంప్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల కోర్టు ఆదేశించింది. నవంబర్ 27 న జరిగిన విచారణలోనే హాజరు కావాలని రంగనాథ్‌ను ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయటంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
అసలు ఏం జరిగింది..?
ఇటీవల.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో కఠిన హెచ్చరిక జారీ చేసింది. బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు డిసెంబర్ 5వ తేదీలోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ వివాదం హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న ఒక ప్రైవేట్ స్థలానికి సంబంధించింది. ఆ స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని.. యథాతథస్థితి కొనసాగించాలని కోర్టు గతంలో జూన్ 12వ తేదీన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కోర్టు ఉత్తర్వులను కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏ. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల.. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రంగనాథ్ హాజరు కాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5వ తేదీలోపు ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.
Also Read
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!