Site icon NTV Telugu

Wives M*urder: మృగాలు నయంరా.. వణికించిన హత్యలు.. భార్యలను కిరాతకంగా చంపిన భర్తలు

Wife

Wife

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో బంధువుల ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దంపతులు మంజుల, శంకర్ లు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు గుర్తించారు. మంజులపై అనుమానంతో నే శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:MLC Kavitha: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదు..

బోడ శంకర్(40),భార్య పేరు మంజుల(35) వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఇద్దరు బాబులు. వీరి స్వస్థలం మోత్కూర్ దగ్గర అడ్డగూడూర్ గ్రామం. నాలుగు రోజుల క్రితం మహేశ్ నగర్ కాలనిలో ఉంటున్న అక్క బావ ఇంటికి కుటుంబంతో వచ్చిన శంకర్ అర్థరాత్రి అందరు పడుకున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్యను నరకడంతో ఆమె అరుపుల శబ్దానికి అందరు లేవడంతో శంకర్ అక్కడి నుండి పారిపోయాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:Suryapet: నీకు చేతులెలా వచ్చాయిరా.. భార్యతో గొడవ పడి.. చిన్నారి కాళ్లు పట్టుకొని నేలకు కొట్టిన కసాయి తండ్రి

కొమురం భీం జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ లో భార్యను హత్య చేసిన భర్త గజ్జల తిరుపతి. భార్య స్రవంతి (40) ని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు భర్త. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version