NTV Telugu Site icon

Aishwarya Addala: పెళ్లి చేసుకుని మోసం చేసిందని.. మీడియాను ఆశ్రయించిన ప్రముఖ సీరియల్ నటి భర్త!

Aishwarya Addala Marriage

Aishwarya Addala Marriage

ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లయిన తర్వాత ఐశ్వర్య 25 లక్షలు కాజేసి.. విడాకులు ఇవ్వాలని తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు.

2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. ‘కాపు మ్యాట్రిమొనీ’ ద్వారా సీరియల్ నటి అయిన ఐశ్వర్యని శ్యామ్ కుమార్ వివాహమాడారు. జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ.. పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్‌లలో ఐశ్వర్య నటిస్తున్నారు. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్‌లలో ఆమె నటిస్తున్నారు. పలు సినిమాల్లో కూడా ఐశ్వర్య నటించారు.

Also Read: Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. ఒకే నియోజకవర్గం నుంచి మాజీ భార్యభర్తలు పోటీ!

పెళ్లైన నెల రోజుల తర్వాత సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనపై బెదిరింపులకు పాల్పడుతుందని శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారింది.

Show comments