Crime News: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో ఈ హత్య ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Pawan Kalyan: ఈ గుండె మీ కోసమే కొట్టుకుంటుంది
ఈ ప్లాన్ లో భాగంగా హత్య రోజు వెంకటేష్‌ను అతని భార్య, మామ ఇంట్లోనే గొంతు నులిమి చంపారు. అంతటితో ఆగకుండా వైరుతో మెడను గట్టిగా చుట్టారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే తాండూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతానికి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Pawan Kalyan: రీమేక్ లు చేస్తావని తిడతారు.. నాకు బడా డైరెక్టర్లు లేరు!
