Site icon NTV Telugu

Live-in Relationship: వీడేం మొగుడండీ బాబు.. భార్యా, పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం..

Live In Relationship

Live In Relationship

జగిత్యాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లై 10 ఏళ్లు గడిచింది. భార్య ఇద్దరు కుమారులున్నారు. ఆ భర్త భార్యా, పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకున్నాడు.

Also Read:Srushti Test Tube Baby Centre: సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో కొత్త కోణం.. ప్లాన్ మామూలుగా లేదుగా

ఈ క్రమంలోనే భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కుటుంబ సభ్యులు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ దీపు లను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన పలువురు వీడెక్కడి మొగుడండీ బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Exit mobile version