Husband Kills Wife: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ కసాయి మొగుడు. మద్యం మత్తులో భార్య సుగుణమ్మ (48) ను కిరాతకంగా గొడ్డలితో హత్య చేశాడు భర్త వడ్డే రమణ. వడ్డే రమణ చాలా కాలంగా తాగుడు బానిసగా మారాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కోపం పెంచుకున్న రమణ నిద్రిస్తున్న భార్యను తెల్లవారు జామున గొడ్డలితో నరికి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల సీఐ గోపినాథ్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడు రమణపై కేసు నమోదు చేశారు.
Read Also: Delhi: బేబీ కేర్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు నవజాత శిశువులు దహనం