ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన రెండో భార్యకు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకుతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆమె కన్నబిడ్డలు కూడా సహకరించారు. ఈ ఘటన యూపీలోని బందా జిల్లాలో జరిగింది. తలలేని మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె చేతికి నాలుగు వేళ్లు కూడా లేకపోవడం కనుగొన్నారు. మృతురాలి పై పాక్షికంగానే దుస్తులు ఉన్నాయి. ఇక మొండెనికి కొంత దూరంలో తలను గుర్తించిన పోలీసులు తలపై వెంట్రుకలు లేనట్టు గమనించారు. అంతేకాదు ఆమె దంతాలు కూడా విరిగిపోయాయి. ఆ మహిళ వయసు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని కనుగొన్నారు.
Also Read: Tirupati Reddy: హాట్ కేక్లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ హత్యలో మహిళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. విచారణలో తామే ఈ హత్యకు ప్లాన్ చేశామని భర్త రామ్ కుమార్, అతడి కుమారులు సూరజ్ ప్రకాశ్, బ్రిజేష్, మేనల్లుడు ఉదయ్ భాన్ అంగీకరించారు. భర్తకు మొదటి భార్య ద్వారా కలిగిన కుమారుడితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని రామ్ కుమార్ అనుమానించాడు. దీంతో అతడు తన కుమారులు, మేనళ్లుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించారు. ఇక బాధితురాలు మాయాదేవి దేవిని వారంతా చమ్రాహా గ్రామానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శరీరం నుంచి మొండెం వేరు చేశారు. చేతి వేళ్లను నరికేశారు. ఎవరికి అనుమానం రాకుండా మహిళ శరీరాన్ని నాశనం చేయాలనుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా భార్యను అనుమానంతో చంపడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.