NTV Telugu Site icon

Tragedy: వీడు నిజంగా భార్యా బాధితుడే.. అందుకే 13నెలలు జైల్లో ఉన్నాడు

Husband

Husband

Tragedy:కొన్నిసార్లు చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన కేసులో భర్త 13 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన వెంటనే భర్త తన భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఇంకొకరితో అదే భార్య ఇప్పుడు సజీవంగా దొరికింది. తప్పుడు సమాచారంతో కేసు పెట్టినందుకు ఇప్పుడు ఆమె తరపు బంధువులు సమస్యల్లో చిక్కుకోవాల్సి వచ్చింది.

మస్సోనా సుఖ్‌పూర్ గ్రామంలో నివసించే దీపు, రుచిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య కుదరలేదు. నిరంతరం గొడవలు జరిగాయి. దీంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె తన మామతో కలిసి వెళ్లింది. కానీ పంచాయితీ మళ్లీ ఇద్దరిని కలిపింది. ఆమెకు నచ్చజెప్పి మరోసారి అత్తరింటింకి పంపింది. దీంతో తిరిగి భర్తతో వచ్చింది. అలా ఇంటికి వచ్చిన రుచి వారం రోజుల తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీపు, అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం చాలా వెతికారు. కానీ ఎటువంటి సమాచారం లభించలేదు. దీపు, అతని కుటుంబ సభ్యులపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దీపును పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Fire Accident : మొగుడు పెళ్లాన్ని విడదీద్దామని వచ్చారు.. మంటల్లో కాలిపోయారు

ఇప్పుడు నిజం బయటకు రావడంతో అతని భార్య రుచి సహా నలుగురిపై కేసు నమోదైంది. 13 నెలలుగా జైలులో ఉన్నాను అని బాధితుడు దీపు చెబుతున్నాడు. బెయిల్ రావడంతో భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. అప్పుడు ఆమె భింద్ జిల్లాలోని గియాన్‌పూర్‌లో కనుగొనబడింది. దీని తర్వాత రుచి, ఆమె మేనమామ, సోదరిపై విచారణ జరుగుతోంది.

వీళ్ల కారణంగానే తమ కుటుంబం కష్టాల పాలయ్యామని దీపు తరపు వాళ్లు తెలిపారు. వారిని మూడు రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని వాపోయారు. ఇంట్లో పరిస్థితి దయనీయంగా ఉందని.. భూమిని అమ్ముకోవాల్సి రావడంతో జైలు నుంచి వచ్చిన తర్వాత దీపు చెరుకు బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.