అనుమానాలు, అదనపు కట్నాలు, అక్రమసంబంధాలు వివాహబంధంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు కొందరు భర్తలు. రెండ్రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం వేధించి భార్యకు నిప్పు పెట్టి చంపేశాడు. మేడిపల్లిలో భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి ప్రాణం తీశాడు భర్త. తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. వరంగల్ లోని హంటర్ రోడ్డులో భార్య గౌతమిని(21) హత్య చేశాడు భర్త గణేష్( 22). మొహంపై దిండుపెట్టి నొక్కి హత్యకు పాల్పడ్డాడు.
Also Read:Love: పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. వైజాగ్ తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో యువతి..
గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తండ మహబూబాద్ జిల్లా. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న గౌతమి గణేష్. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడ గణేష్. కాగా తమ కూతురును అదనపు కట్నం కోసమే హత్య చేశాడని గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు గౌతమి తండ్రి అశోక్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
