Husband Cheating: ఒక్క ఫ్యామిలీతోనే నెట్టుకురావడం గగనమైన ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో పాటు మరొకరితో సహజీవనం చేయడం చర్చానీయాంశంగా మారింది. చివరకు విషయం కాస్తా ఇద్దరికి తెలియడంతో సీన్ రివర్సైంది. ఒకరికి తెలియకుండా మరొకరితో హ్యాపీగా సహజీవనం చేస్తున్న సదరు వ్యక్తి గుట్టు రట్టు అయింది. ముగ్గురి జీవితాలతో ఆడుకున్న ఈ ఘరానా మొగుడి బాగోతం భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో వెలుగు చూసింది.
Hyderabad: నగరవాసులకు శుభవార్త.. రద్దీని తగ్గించేందుకు మరో 104 లింక్ రోడ్లు
ఒకరికి తెలియకుండానే మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్న రామవరంలోని రావుల దాసు బాగోతం బట్టబయలు కావడంతో తమకు న్యాయం కావాలని ముగ్గురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసి మోసపోయానని గ్రహించిన రెండో భార్య మధు మాధవి రామవరంలోని రావుల దాసు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. 18 ఏళ్లుగా భర్తగా నటిస్తూ 25 లక్షలు లూటీచేసినట్లు ఆమె మండిపడింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. బాధితురాలికి మద్దతుగా మహిళా సంఘాలు నిలిచాయి.