NTV Telugu Site icon

Harassment: ఆ స్టార్ హీరో సినిమాలు చూస్తున్నందుకు భార్యను కొట్టిన భర్త.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

Sal

Sal

Husband Beaten Up Wife For watching Salman Khan’s Movies: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న  విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి. కూరలో ఉప్పు తక్కువ అయ్యిందనే కారణంతో కూడా భార్యను చితబాదే భర్తలను చూశాం. పక్కింటి వారితో, బంధువులతో, స్నేహితులతో, మాజీ లవర్ తో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించే భర్తలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే భార్య భర్తల మధ్య గొడవకు మాత్రం కారణం తెలిస్తే షాక్ అవుతారు. తన భార్య ఓ హీరో సినిమా చూస్తుందని ఆమెతో గొడవపడి కొట్టాడు ఓ భర్త. దీంతో అతడిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఆ ఇల్లాలు. ఆమె చెప్పిన కారణం విని షాక్ అయ్యారు పోలీసులు.

Also Read:  Morocco Earthquake: మొరాకో భూకంపం.. వైరల్ అవుతున్న వీడియో

వివరాల్లోకి వెళ్తే వడోదరకు చెందిన ఓ భార్య భర్తల మధ్య జరిగిన గొడవ ఇది.  ఆ గొడవకు కారణం కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్ సినిమాలు చూస్తుందని భార్యను కొట్టాడు భర్త. ఒకసారి సల్మాన్ ఖాన్ సినిమా చూసి అతడిని ప్రశంసించానని అప్పటి నుంచి తన భర్తలో అసూయ మొదలయ్యిందని ఆమె తెలిపింది. ఇక అదే మొదలు ఎప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిన ఛానెల్ మార్చేసేవాడని పేర్కొంది. కొన్నాళ్లకు యాడ్స్ లో కూడా సల్మాన్ ఖాన్ ను చూడనిచ్చేవాడు కాదని పేర్కొంది. ఇంకా కొన్ని రోజుల తరువాత  ఆ అనుమానపు రోగం ఎలా మారిందంటే ఆఖరికి రోడ్డుపై సల్మాన్ ఖాన్ హోల్డింగ్స్ కనిపిస్తన్నా వాటిని చూడటానికి ఆ భర్త అంగీకరించలేదు. ఈ మధ్య ఒక రోజు టీవీలో సల్మాన్ సినిమా చూస్తుంటే తన భర్త తనతో గొడవపడి కొట్టాడని దాంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. దీంతో ఆమె భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సినిమా హీరోను ఇష్టపడుతుందని కూడా భార్యతో గొడవపడి, కొడతారా అంటూ ఇది తెలిసిన కొంతమంది నోరెళ్లబెడుతున్నారు.