Morocco Earthquake: శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 6.8గా ఉంది. ఈ ఘటనలో దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 670 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొరాకో భూకంపం పై ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. చేతనైనంత సాయం చేస్తామని నరేంద్రమోడీ మొరాకోకు జీ-20 వేదికగా హామీ ఇచ్చారు. ఈ ఘటనలో నిద్రలోనే చాలా మంది ప్రమాదంలో చిక్కకుకున్నారు. చాలా మంది భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. వారి కళ్ల ముందే ఎతైన భవానాలు కూలిపోవడం చాలా మంది వారి ఫోన్లలో వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. అవి చూస్తుంటేనే భూకంపం ఎంత ఘోరంగా నష్టం చేకూర్చిందో అర్థం అవుతుంది.
Also Read: Morocco Earthquake: 820కి చేరిన మృతుల సంఖ్య.. ఎటూ చూసినా శిథిలాలే..
ఇలాంటి ఓ విపత్తు మొరాకోకు తీరని లోటు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఒక్కసారిగా ప్రజల జీవితాలన్ని చిన్నాభిన్నమయ్యాయి. రాత్రికి రాత్రికి చాలా మంది రోడ్డున పడ్డారు. అనేక మంది కుటుంబ సభ్యులను కోల్పొయారు. వైరల్ వీడియో చూస్తుంటే గుండెల్లో కలుక్కుమంటుంది. భూకంపం కారణంగా మర్రాకెచ్ నగరం మరీ ఎక్కువగా నష్టపోయింది. దీంతో పాటు దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా కోస్టల్ నగరాలు కాసాబ్లాంకా, ఎసౌరియాలోనూ ప్రకంపనలు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భూకంపం కారణంగా మొరాకో గతంలో ఎన్నడూ లేనంతగా నష్టపోయింది. శిధిలాల చిక్కుకున్న వారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇక వంద సంవత్సరాల కాలంలో ఉత్తరాఫ్రికాలో ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ ఎన్నడూ చూడలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
🚨 #BREAKING | #Morocco | #earthquake | #Marrakech |#الزلزال | #المغرب
The moment a building completely collapsed following the earthquake that struck Morocco a short while ago. pic.twitter.com/9n22NfiC8F
— Bot News (@BotNews18) September 9, 2023