NTV Telugu Site icon

Husband Attack: భార్యపై అనుమానంతో కత్తితో దాడి.. దేహశుద్ధి చేసిన స్థానికులు

Knife Attack

Knife Attack

Husband Attack: కట్టుకున్న భార్యపై అనుమానంతో కడతేర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా మరోసారి ఆ విషయంపై వాగ్వాదం నెలకొనగా.. ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. భార్య దుర్గాదేవి కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. భర్త నాగప్రసాద్‌ వద్ద స్థానికులు కత్తి లాక్కొని అడ్డుకున్నారు. అనంతరం అతడిని ఆపేందుకు ప్రయత్నించగా స్థానికులపై నాగప్రసాద్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోని స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు పట్టించేందుకు ప్రయత్నించగా.. అక్కడ నుంచి పరారైనట్లు తెలిసింది. కత్తి దాడి నేపథ్యంలో గాయాల పాలైన దుర్గాదేవి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 

Read Also: Rave Party: బెంగళూర్ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజుతో హైదరాబాదులో లగ్జరీ ఫ్లాట్ కొనేయచ్చు తెలుసా?

Show comments