NTV Telugu Site icon

Husband Attack on Wife: భార్యపై కత్తితో దాడి.. రాయచోటిలో భర్త దారుణం

Bapatla Volunteer Died

Bapatla Volunteer Died

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేట రెడ్డివారిపల్లె లో చోటు చేసుకుంది. రాత్రి మద్యం మత్తులో ఉన్న రాజనాల వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి తో కొడవ కు దిగాడు. దీంతో భార్యభర్తలు ఘర్షణ పడ్డారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరికీ సర్ది చెప్పి వెంకటరమణ కు కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో తెల్లవారుజామున నిద్రపోతున్న భార్య రాజేశ్వరిని కత్తి తీసుకొని అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు.

భర్త పాశవికంగా దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి రక్త మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాజేశ్వరి ని కుటుంబ సభ్యులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Cm Jagan Gokavaram Tour:గోకవరంలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్

మరోవైపు గత నెల 29వ తారీఖున జరిగిన యువతిపై అత్యాచారం, హత్య కేసులో నిందితున్ని అరెస్ట్ చేశారు అరకులోయ సర్కిల్ పోలీసులు. అరకులోయ సిఐ జీడి బాబు మాట్లాడుతూ డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్ పంచాయతీ నందివలస గ్రామంలో గెమ్మెల్లి సావిత్రి 20 యువతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమిక సాక్షాలను బట్టి అత్యాచారం, అనంతరం హత్య జరిగినట్లుగా కేసు నమోదు చేశామని, గ్రామస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు జన్ని రామచందర్ ఈ సంఘటనకు బాధ్యుడిగా అరెస్టు చేశామన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఈ సంఘటనలో జన్ని రాంచందర్ ఒక్కడే పాల్గొన్నట్లు మా విచారణలో తేలిందన్నారు. ముద్దాయిని కోర్టులో హాజరపరిచి రిమాండ్కు తరలించామని సిఐ జీడి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ ఎస్సై సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Tamil Nadu Rains: దంచికొడుతున్న వర్షాలు.. చెన్నైతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Show comments