NTV Telugu Site icon

Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

Clash With Cops

Clash With Cops

Clash With Cops: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘వారీస్‌ పంజాబ్‌ దే’ అధినేత అమృత్‌పాల్‌ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తుఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా అమృత్‌పాల్‌ మద్దతుదార్లు వేలాది మంది తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్‌స్టేషన్‌ పైకి దండెత్తారు. తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్‌లోకి చొచ్చుకుని పోయారు. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

లవ్​ప్రీత్​ తుఫాన్‌ను పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారని అమృత్‌పాల్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ తన అనుచరులతో కలిసి జల్​పుర్ ఖైరా ప్రాంతం నుంచి అజ్నాలాకు భారీ ర్యాలీగా బయల్దేరారు. అక్రమంగా అరెస్టు చేసిన లవ్‌ప్రీత్‌ను విడుదల చేయకపోతే తమ సొంత ప్లాన్‌ను అమలు చేస్తామని పోలీసులను హెచ్చరించారు.

Read Also: Kodali Nani: చంద్రబాబు భార్య కోసం బయట, కొడుకు కోసం లోపల ఏడుస్తాడు..

‘వారిస్ పంజాబ్ దే’ గ్రూప్ చీఫ్ అమృతపాల్ సింగ్ అనుచరులు లవ్‌ప్రీత్ తూఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. ఒక్క గంటలో కేసును రద్దు చేయకపోతే ఇక ఏం జరిగినా దానికి పాలనా యంత్రాంగానిదే బాధ్యత అని.. మేమేమీ చేయలేమని భావిస్తున్నామని అని అమృతపాల్ సింగ్ అన్నారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిసింది. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’ గ్రూప్‌కు అమృతపాల్ సింగ్ అధిపతి.