NTV Telugu Site icon

Smriti Irani: ఢిల్లీలో హగ్గింగ్, కేరళలో బెగ్గింగ్..

Irani

Irani

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు. వారిని రాహుల్ ఢిల్లీలో కౌగిలించుకొని.. కేరళలో మాత్రం సీటు కోసం అడుక్కుంటున్నారు అని సెటైర్ వేశారు. కాగా, వయనాడ్ లో రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ తప్పబట్టాడు అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గుర్తు చేశారు.

Read Also: Israel Military: ఇజ్రాయిల్ దిద్దుబాటు చర్యలు.. కీలక ఆఫీసర్లు ఔట్

ఇక, కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె. సురేంద్రన్‌కి మద్దుతగా స్మృతి ఇరానీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీ మే హగ్గింగ్‌, కేరళ మే బెగ్గింగ్, కర్ణాటక మే థగ్గింగ్‌ అంటూ విమర్శలు గుప్పించింది. మహిళలు భారీ సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఓట్లు వేయడం ఏ టీవీ సీరియల్‌ల ఆట కాదు.. ఇది ఒక భారీ బాధ్యత, ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో మహిళలను సీరియస్‌గా తీసుకోవాలనుకుంటే.. మనం ముఖ్యమైన రాజకీయ విషయాలపై దృష్టి పెట్టాలని ఆమె మహిళలందరినీ కోరారు. ‘సాస్-బాహు’ సీరియల్స్ జీవిత వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని తెలిపారు.

Read Also: Congress: లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల

అయితే, కాంగ్రెస్ ఇప్పటికీ బలమైన ఉనికిని కలిగి ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కేరళ ఒకటి.. ఇక్కడి నుంచి 20 మంది ఎంపీలు లోక్‌సభకు ప్రతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి 4.31 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) 20 స్థానాలకు గాను 19 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రెండు సీట్లు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒకటి, కేరళ కాంగ్రెస్ (ఎం) ఒక సీటు గెలుచుకున్నాయి. అలప్పుజాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఒక స్థానాన్ని గెలుచుకుంది.