NTV Telugu Site icon

Karthika Masam First Monday: కార్తిక మాసం మొదటి సోమవారం.. గోదావరి నదికి భక్తుల తాకిడి

Karthika Masam

Karthika Masam

Karthika Masam First Monday: కార్తిక మాసం అంటేనే ఎంతో ప్రత్యేకత.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తిక మాసంలో స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది స్కంద పురాణం చెబుతుంది.. ‘న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.” అని పేర్కొన్నారు.. అంటే కార్తికమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. అని అర్థం.. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చు అని వారి విశ్వాసమం..

ఇక, కార్తికమాసంలో తొలి సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని చెబుతారు.. ఈ సందర్భంగా గోదావరి నది భక్తులతో కిటకిటలాడుతోంది.. కార్తిక మాసంలో మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాదిగా తరలివచ్చి భక్తులు గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిసాయి. భక్తులు స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లను మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు.

కార్తికమాస తొలి సోమవారం సందర్భంగా పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తజనం.. భీమవరం పంచారామ క్షేత్రంలో కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమరేశ్వర ఘాట్, వలందరరేవులో కార్తీకమాసం స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో మారుమోగుతోంది గోదావరి తీరం.. భక్తులతోఅమరేశ్వర, కపిల మల్లేశ్వరస్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.. కొవ్వూరు గోష్ప్రద క్షేత్రంలో మొదటి కార్తీక సోమవారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు పుణ్య గోదావరి నదిలో దీపాలను వదిలి, పూజలు నిర్వహించారు. గోష్పాద క్షేత్రంలోని గోష్పాదేశ్వరునికి పూజారులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామ భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గోదావరి నది తీరం కిటకిటలాడుతోంది.

మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్నానఘట్టాలు.. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో
వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు.. భక్తుల పుణ్య స్నానాలతో కిక్కిరిసాయి పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ . స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు భక్తులు.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శివనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగుతోంది.