Kartika Purnima : శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karathika Purnima : హిందూ సంప్రదాయంలో కార్తీక పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమినే త్రిపరి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు లయకారుడు శివుడు త్రిపురాసురుడిని సంహరించాడన్నది పురాణ గాధ. అయితే.. అప్పటి నుంచి శంకరుడిని త్రిపురారి అని కూడా పిలుస్తారు. ఈ సారి కార్తీక పూర్ణిమ నవంబర్ 8 మంగళవారం ఉంది. అయితే.. అదే రోజున చంద్రగ్రహణం ఉండటంతో దేవాలయాలను మూసివేయనున్నారు. దీంతో ఒకరోజు ముందుగానే కార్తీక పౌర్ణమి జరుపుకుంటున్నారు భక్తులు. అయితే.. గత నెలలో దీపావళి రోజున సూర్యగ్రహణం రావడంతో.. ఒకరోజు ముందుగానే వేద పండితులు సూచనల మేరకు దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమ నాడు చంద్రగ్రహణం రావడంతో.. ఒక రోజు ముందుగానే శైవక్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. అయితే.. కార్తీక పౌర్ణమితో పాటు సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. దీంతో.. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.
Also Read :Gujarat : బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్‌బై..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అయితే.. ప్రకాశం జిల్లాలో కార్తీక సోమవారం సందర్భంగా శైవాలయాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. త్రిపురాంతకం, భైరవకోన, సోపిరాల, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, పొదిలి శ్రీ నిర్మామహేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బాపట్లలో వేటపాలెం నాయనిపల్లిలో శ్రీగంగా పార్వతీ సమేత బోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి స్వామి వారిని నేరుగా సూర్యకిరణాలు తాకనున్నాయి. వారం రోజులపాటు స్వామి వారిని తాకనున్నాయి సూర్యకిరణాలు. దీంతో.. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
Also Read : Karthika Somavaram : రెండవ కార్తిక సోమవారం నాడు ఈ స్తోత్రం వింటే మీ బాధలు కష్టాలు ఇట్టే తొలగిపోతాయి
కాకినాడలో కార్తీక సోమవారం సందర్బంగా పంచారామాలు వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ద్రాక్ష రామము, కుమార రామము భీమేశ్వర స్వామి దేవస్థానాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నుంచి అభిషేకాలతో పాటు భక్తుల ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో శైవాలయాలు మార్మోగుతున్నాయి.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామునుంచి వ్రతాలు సర్వ దర్శనాలకు భక్తులు తరలవస్తున్నారు. కార్తీక పౌర్ణమి కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ లు కిక్కిరిసిపోయాయి. స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో భక్తులు కార్తీక దీపాలు వదులుతున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Also Read : Health Tip: సీతాఫలంతో.. మగవారి నరాల బలహీనతకు చెక్
తూర్పుగోదావరి జిల్లాలో నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి ప్రత్యేక హారతి నిర్వహించనున్నారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరీ నిత్యహారతిలో భాగంగా ప్రత్యేకంగా పౌర్ణమి హారతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా.. అనంతపురం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. శివకోటిలో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.
తిరుపతిలో కార్తీక సోమవారం సందర్బంగా శ్రీకాళహస్తి, కపీలతీర్దం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచి అభిషేకాలతో పాటు భక్తుల ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. గుంటూరులోని అమరావతి కృష్ణా నది తీరాన నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతిలో కృష్ణానది తీరాన నేడు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో నేడు కార్తీక పౌర్ణిమ పురస్కరించుకొని శివాలయాలలో కృతికోత్సవం ఏర్పాటు చేశారు. దీంతోపాటు.. హిందూపురం పట్టణంలోని యల్లమ్మ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పూలపల్లకి ఉత్సవం, లక్షదీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..