NTV Telugu Site icon

TTD : రికార్డు స్థాయిలో తిరుమలేశుడి హుండీ ఆదాయం

Ttd

Ttd

ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరుడి స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో లభించింది. మునుపెన్నడూ లేనివిధంగా తిరుమలేశుడి హుండీ ఆదాయం పెరిగింది. ఒక్కరోజులో శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.30 కోట్లు లభించింది. శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు టీటీడీ అధికారులు. అయితే.. 2018 జూలై 26న రూ.6.28 కోట్లు లభించి.. ఇదే ఇప్పటివరకు రికార్డు స్థాయి ఆదాయంగా ఉంది. అయితే.. ఆ రోజు సాధారణ హుండీ ఆదాయం రూ.4.64 కోట్లతో పాటు గతంలో ఉన్న నాణేల లెక్కింపు ద్వారా వచ్చిన రూ.1.64 కోట్ల ఆదాయాన్ని కూడా జత చేయడంతోనే రికార్డుస్థాయిలో రూ.6.28 కోట్లు లభించినట్టు టీటీడీ వెల్లడించింది.

Also Read : Nagababu : ఓహో ఇప్పుడు జనసేన మీద మరోసారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధం
ఆ తర్వాత ఈఏడాది జూలై 4వ తేదీన రూ.6.18 కోట్లు లభించిన నేపథ్యంలో రెండవ రికార్డుగా సృష్టించింది. కానీ, వీటన్నిటికంటే తాజాగా, రూ.6,30,96,200లు శ్రీవారి హుండీ ఆదాయం లభించడం విశేషం. ఇదిలా ఉంటే.. రోజు రోజుకు తిరుమలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. దేశ నలూమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి సైతం స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ఇటీవల శ్రీవారి బ్రహోత్సవాల తరువాత భక్తుల తాకిడి మరింత పెరిగిందని టీటీడీ వర్గాలు వెల్లడించారు. ప్రతి రోజు కంపార్టుమెంట్లు నిండిపోతున్నాయని, స్వామి వారి దర్శనానికి సుమారు 10 నుంచి 20 గంటల సమయం పడుతున్నట్లు పేర్కొన్నారు టీటీడీ అధికారులు.

Show comments