NTV Telugu Site icon

Fire Accident: ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident

Fire Accident

Fire Accident in Azadpur Mandi: స్థానికంగా ఆజాద్‌పూర్ మండి అని పిలువబడే ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాద సమాచారం అందడంతో 11 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Also Read: Road Accident: ఏపీలో అన్న ప్రేమ కోసం తమ్ముడి బలి..

ప్రాథమిక సమాచారం ప్రకారం మార్కెట్‌లోని టమాటా షెడ్డులో మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆజాద్‌పూర్ మండి వద్ద టమాటా షెడ్డు వెనుక ఉన్న చెత్త కుప్పలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మార్కెట్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తర ఢిల్లీలోని ఈ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పరిగణించబడుతుంది. శుక్రవారం తెల్లవారుజామున ఘజియాబాద్‌లోని కొత్వాలి ఘంటాఘర్ ప్రాంతంలోని రసాయన గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

 

Show comments