మాదాపూర్‌లోని మూవింగ్ ఎడిన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో శనివారం సాయంత్రం మంటలు చెలరేగడంతో ఆస్తి దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైటెక్ సిటీ సమీపంలోని ఓ భవనంలోని పెంట్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, వారు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి & కంపెనీ ఎంప్లాయిస్ మాట్లాడుతూ.. సాయంత్రం 7గంటల ప్రాంతంలో పొగలు వచ్చాయి. మూవింగ్ ఎడిన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో మంటలు వ్యాపించాయి.
Also Read : Kishan Reddy : రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదు
కంపెనీలో ఉన్న ఐదుగురు ఎంప్లాయిస్ పొగలు చూసి భయపడి బయటికి పరుగులు తీశాము. సేఫ్ గా కిందికి వచ్చాము. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. వెంటనే 100 దయాళ్ కి సమాచారం ఇచ్చాం. మూవింగ్ ఎడిన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో లోనీ రెండవ అంతస్తులో ఏ సి రిపేర్ లో ఉన్నాయి. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులకు గూగుల్ లొకేషన్ పంపాము. వెంటనే 5నిమిషాల్లో రెండు ఫైర్ ఇంజన్లు స్పాట్ రిచ్ అయ్యాయి. పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసాము. ఫైర్ సిబ్బంది & డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ లోనికి వెళ్లి ఫైర్ అయిన ఏరియా ను కూల్ చేసాము. కంపెనీలో ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది. ఏసీ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాద జరిగిందని ప్రాథమికంగా గుర్తించాం. భవనం లోనికి ఒకే మార్గం ఉండడంతో లోనికి వెళ్ళడం కష్టం అయింది. పక్క భవనం నుండి లోనికి వెళ్లి పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసామని వెల్లడించారు.
Also Read : IPL 2023: లక్నోను ఆదుకున్న పూరన్.. కేకేఆర్ ఎదుట భారీ టార్గెట్
