Gold Price Today : ఇటీవల బంగారం మాట వింటేనే జనాలు షాక్ కు గురవుతున్నారు. కొంత కాలంగా ఆల్ టైమ్ రికార్డు ధరలను బద్దలు కొడుతూ వస్తున్న బంగారం ధర తాజాగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గింది. ప్రస్తుతం ఆర్నమెంట్ బంగారం(ఆభరణాలు తయారు చేసేది) ధర 57 వేల రూపాయల లోపు ఉండగా, స్వచ్ఛమైన బంగారం(బిస్కట్ బంగారం) ధర 62 వేల రూపాయల దిగువకు చేరుకుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.
Read Also: Mahesh Babu: ఆరోజు రీజనల్ సినిమాల్లో కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది
నేటి దేశీయ బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,550 కాగా, ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,690గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 వద్ద ట్రేడవుతోంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.61,840 వద్ద ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆర్నమెంట్ బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.56,550గా ఉండగా, స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం ముంబైలో రూ.61,690గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,740గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,690గా కొనసాగుతోంది.
Read Also:SBI: SBI బ్యాంక్ ఖాతాను మరొక బ్రాంచ్‌కి బదిలీ చేయాలా.. చాలా సింపుల్