NTV Telugu Site icon

J-K: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్లు..ఆరుగురు ఉగ్రవాదుల హతం..

Army

Army

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. కుల్గామ్‌లోని మోదర్‌గామ్‌, చినిగామ్‌ గ్రామాల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు మదర్గాంలో, మిగిలిన నలుగురు చినిగాంలో హతమయ్యారు. కుల్గామ్‌లోని మోదర్గామ్‌లోని ఒక తోటలో నిర్మించిన రహస్య స్థావరంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. చినిగాం ఫ్రిసల్‌లో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఉగ్రవాదులపై ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్ర వాయిదా పడిన సంగతి తెలిసిందే. యాత్ర వాయిదా అనంతరం ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతా దళాలు.

READ MORE: Boiler Blast: అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పేలిన బాయిలర్.. 15 మందికి తీవ్రగాయాలు

మొదట జరిగిన ఎన్ కౌంటర్ లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ నైన్ వీరమరణం పొందారు. దీంతో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. రెండో ఎన్‌కౌంటర్ ఫ్రిసల్ చినిగామ్ గ్రామంలో జరిగింది. ఈ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉండవచ్చని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ ఆపరేషన్‌లో 1వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ రాజ్ కుమార్ వీరమరణం పొందారు. గ్రామానికి చేరుకోగానే.. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఇంకా రెండు చోట్ల భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్ధి ఎన్‌కౌంటర్ ప్రదేశాలను సందర్శించి, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.