CM Relief Fund: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. వరద సాయం నిమిత్తం రూ.20 కోట్లను రిలయన్స్ కంపెనీ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు. రూ. 2 కోట్లు చొప్పున ఐటీసీ గ్రూప్, ఎల్జీ పాలిమర్స్ విరాళాన్ని అందజేశాయి. రూ. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల తరపున రూ. 25 లక్షల చెక్కును మోహన్ బాబు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రూ71.50 లక్షల చెక్కును అందజేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన (రావ్ వెంకటశ్వేత చలపతికుమార కృష్ణ రంగారావ్), సుజయ్‌కృష్ణ రంగారావులు అందజేశారు. రూ.84.83 లక్షల చెక్కును ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల తరఫున ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, తదితరులు అందజేశారు.
Read Also: CM Chandrababu: జగన్ తిరుమల పర్యటన అందుకే రద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు