NTV Telugu Site icon

iPhone: ఐఫోన్ లవర్స్ కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 15, 16లపై భారీ డిస్కౌంట్

Iphone

Iphone

ఐఫోన్ కు ఉండే క్రేజే వేరు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని వెయిట్ చేసేవాళ్లు లేకపోలేదు. ఇలాంటి వారికి ఐఫోన్లపై క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆపిల్ ప్రీమియం రిసెల్లర్ iNvent ప్రస్తుతం దాని బిగ్ డీల్ డేస్ సేల్ కింద iPhone 15, iPhone 16, iPhone 16 Plus లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని ఏప్రిల్ 15 వరకు పొందవచ్చు. ఈ సేల్‌లో ప్రీమియం మోడళ్లను అత్యంత తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు. అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

Also Read:Virgin Boys: మిత్రా శర్మ ‘వర్జిన్ బాయ్స్’ సినిమాకి మోక్షం..

ఐఫోన్ 15

ఆపిల్ ఐఫోన్ 15 ఫోన్‌ను 2023లో రూ.79,900కి లాంచ్ చేసింది. కానీ ప్రస్తుతం ఈ హ్యాండ్ సెట్ ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.69,900కి లిస్ట్ చేయబడింది. అయితే iNvent వెబ్‌సైట్ నుంచి కేవలం రూ.62900కి డిస్కౌంట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.61,400 ధరకు లభిస్తుంది. అయితే, iNvent ఈ ఫోన్ పై ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ICICI, Kotak లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ. 3,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ను రూ. 59,900 కు దక్కించుకోవచ్చు.

Also Read:Samantha : Xలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఏం పోస్టు చేసిందంటే..?

ఐఫోన్ 15 ఫీచర్లు

ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, డైనమిక్ ఐలాండ్ నాచ్ కలిగి ఉంది. ఈ ఫోన్ A16 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. USB-C ఛార్జింగ్ సపోర్ట్‌ తో వస్తుంది.

Also Read:Prasanna Sankar-Dhivya: “బలవంతంగా సె*క్స్ , ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు”.. రిప్లింగ్ దంపతుల కేసులో ట్విస్ట్.

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లపై డిస్కౌంట్

ఆపిల్ గత సంవత్సరం కొత్త ఐఫోన్ 16 ను రూ. 79,900 ధరకు విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ iNvent లో రూ. 9,400 ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 70,500 కు కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్‌ తో కొనుగోలు చేస్తే ఫోన్ ధర రూ.66,500కి తగ్గుతుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.73,900. ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు రూ.80,500కి అమ్ముడవుతోంది. అదే సమయంలో ఈ ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌తో రూ. 4,000 వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. డిస్కౌంట్ ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 76,500కే సొంతం చేసుకోవచ్చు.

Also Read:Gas Cylinder Price Hike: వంటింట్లో మంట.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక లక్షణాలు

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ శక్తివంతమైన A18 చిప్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా మద్దతు ఇస్తుంది. హై-ఎండ్ గేమింగ్‌కు కూడా ఉత్తమమైనది. ఐఫోన్ 16 6.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండగా, ప్లస్ మోడల్ 6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. రెండూ కూడా కొత్త కెమెరా కంట్రోల్ బటన్, మెరుగైన కెమెరా కంట్రోల్ కోసం విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి.