NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు!

Srisailam Temple

Srisailam Temple

Huge Devotees in Srisailam Temple on the occasion of Karthika Masam 2023: కార్తికమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తిక దీపారాధనలతో వెలిగిపోతుంది. కార్తికమాసం, అందులోనూ సెలవు దినం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్నట్లు శ్రీశైలం దేవస్థానం అర్చకులు తెలిపారు. నేటి సాయంత్రం 6 గంటలకు పాతాళగంగ వద్ద పుణ్యనది హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కృష్ణవేణి నదీమతల్లికి దేవస్థానం అర్చకులు కర్పూర హారతులు ఇవ్వనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం జరగనుంది.

Also Read: Mohammed Shami: ఓ వ్య‌క్తిని కాపాడిన భార‌త పేస‌ర్ ష‌మీ.. వీడియో వైరల్!

మరోవైపు కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిప్రదక్షిణను సోమవారం నిర్వహించనున్నారు. రత్నగిరి తొలిపావంచా నుంచి (కొండ దిగువున మెట్లమార్గం ప్రారంభం) రత్న, సత్య గిరిలను చుడుతూ.. పంపా తీరం మీదుగా తిరిగి తొలి పావంచా వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరిప్రదక్షిణ కోసం లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా.