Yadadri Temple: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటల సమయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Rush At Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది.
శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ రోజు ఆలయ మాడ వీధుల్లో శ్రీరామ అలంకారంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాద కౌంటర్లు, నిత్యా కల్యాణం, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది. భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: Singareni Elections: సింగరేణి కార్మికులకు 20 లక్షల వడ్డీ రుణాన్ని అమలు చేస్తాం: పొంగులేటి
మరోవైపు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భద్రాచలం రామాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. ఆలయంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ప్రసాద కౌంటర్లలోనూ భారీ రద్దీ నెలకొంది. నిత్య కల్యాణానికి దంపతులు భారీగా తరలివచ్చారు. ప్రధానాలయంలో మూలవిరాట్ ముత్తంగి (ముత్యాల వస్త్రాలు ధరించిన) రూపంలో స్వామి వారు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో దర్శనానికి మూడు గంటల పైగా సమయం పడుతుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!