NTV Telugu Site icon

Yadadri Temple: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటల సమయం!

Yadadri Temple

Yadadri Temple

Huge Rush At Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ రోజు ఆలయ మాడ వీధుల్లో శ్రీరామ అలంకారంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాద కౌంటర్లు, నిత్యా కల్యాణం, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది. భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.

Also Read: Singareni Elections: సింగరేణి కార్మికులకు 20 లక్షల వడ్డీ రుణాన్ని అమలు చేస్తాం: పొంగులేటి

మరోవైపు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భద్రాచలం రామాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. ఆలయంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ప్రసాద కౌంటర్లలోనూ భారీ రద్దీ నెలకొంది. నిత్య కల్యాణానికి దంపతులు భారీగా తరలివచ్చారు. ప్రధానాలయంలో మూలవిరాట్‌ ముత్తంగి (ముత్యాల వస్త్రాలు ధరించిన) రూపంలో స్వామి వారు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో దర్శనానికి మూడు గంటల పైగా సమయం పడుతుంది.