Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 8 గంటల సమయం!

Vemulawada Rajanna Temple

Vemulawada Rajanna Temple

Huge Rush At Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంకు భక్తులు పోటెత్తారు. సోమవారం, అందులోనూ సెలవు దినాలు కావడంతో స్వామి వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. ప్రస్తుతం క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి ఏకంగా 8 గంటల సమయం పడుతోంది.

Also Read: Suresh Raina: లక్నో సూపర్‌ జెయింట్స్‌లోకి సురేష్‌ రైనా!

గత నెల రోజులుగా రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసంలో శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసంలోని సోమవారం అయితే రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈరోజు సోమవారం, సెలవు దినాలు కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు వేగంగా దర్శనభాగ్యం కల్పించేందుకు ఆలయ అధికారులు కృషి చేస్తున్నారు. పలువురు భక్తులు కోడె మొక్కులను తీర్చుకుంటున్నారు.