NTV Telugu Site icon

Pushpa 2 Trailer: ఏంటి భయ్యా ఆ మాస్ ఫాలోయింగ్.. జనసంద్రంగా మారిన పాట్నా

Puspa 2 (1)

Puspa 2 (1)

Pushpa 2 Trailer: పుష్ప 2 చిత్ర బృందం చెప్పిన విధంగానే సమయానికే మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులతో పాటు భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుష్ప ట్రైలర్ అదరగొట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ సినీ కార్యక్రమం కోసం అల్లు అభిమానులు దేశం నలుమూలల నుంచి పాట్నాకు చేరుకున్నారు. రెండు నిమిషాల 44 సెకండ్ల నిడివితో విడుదలైన ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కేవలం 25 వేల మంది అభిమానులే వస్తారని అంచన వేసిన అధికారులకి షాక్ తగిలందని చెప్పవచ్చు. నిజానికి కార్యక్రమం మొదలైన సమయంలో నగరంలోని గాంధీ మైదాన్ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. లైవ్ ప్రోగ్రాంలో చూస్తుంటే దాదాపు అక్కడ లక్ష మందికి పైగా అభిమానులు ఉన్నారని ఇట్టే అర్థమవుతుంది.

Read Also: Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

సుకుమార్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ రష్మిక మందన్న శ్రీవల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమా సుకుమార్ రైటింగ్ అసోసియేషన్ తో మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మించారు. ఇప్పటికే భారతదేశం సినీ చరిత్రలో భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా పుష్ప రికార్డులు క్రియేట్ చేసింది. మరోవైపు నెల రోజుల కంటే ముందే విదేశాలలో పుష్ప 2 సినిమా సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంటే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మలయాళ నటుడు ఫాజిల్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. రావు రమేష్, సునీల్, అనసూయ, జగతిబాబులు కీలకపాత్రలో నటిస్తున్నారు.

Show comments