NTV Telugu Site icon

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం.. కృష్ణా జిల్లాలో భారీ నష్టం

Collector Raja Babu

Collector Raja Babu

Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌ మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది.. ఇప్పటికే తీరాన్ని తాకింది.. మరో రెండు గంటల్లో పూర్తిగా తీరాన్ని దాటనుంది.. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ రోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రస్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ప్రకటించింది..

Read Also: Khalistani terrorist: భింద్రన్‌వాలే మేనల్లుడు ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్‌లో మృతి

మరోవైపు.. మిచౌంగ్‌ తుఫాన్‌ కృష్ణా జిల్లాలో భారీ నష్టం మిగిల్చింది.. తుఫాన్‌ ప్రభావంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు.. మిచౌంగ్‌ తుఫాన్ వల్ల జిల్లాల్లో భారీగా వరి పంట నష్టం జరిగిందన్నారు.. ప్రస్తుతం 2.83 లక్షల ఎకరాల్లో పంట ఉంది.. వర్షం తగ్గిన తర్వాత 2 రోజుల్లో నష్టం అంచనా వేసి రైతులను పరిహారం ఇస్తాం అని ప్రకటించారు. 20 వేల టన్నుల తడిసిన ధ్యానం మిల్లులకు, గుడౌన్ల కు పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. జిల్లాపై తుఫాన్ ప్రభావం తగ్గిందని భావిస్తున్నాం.. ఇవాళ, రేపు జిల్లాలో వర్షాలు ఉంటాయన్నారు. ఇక, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల వారికి పునరావాసం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు.