NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా బరిలోకి అరడజన్ సినిమాలు

Gamechanger

Gamechanger

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్‌ మూవీ పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌జె సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Read Also:CMR Engineering College: సర్దుమణిగన గర్ల్స్ హాస్టల్‌ వివాదం.. యాజమాన్యం ముందు స్టూడెంట్స్ డిమాండ్లు

శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నారు. అయితే, ఈ సినిమాను కోలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తమిళ్‌లో స్టార్ హీరో అజిత్ నటించిన ‘విదాముయార్చి’ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో పోటీ భారీగా నెలకొంది. ఇప్పుడు అజిత్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’కు పోటీ లేదని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా రానున్నాయి. అజిత్ సినిమా వాయిదా పడడంతో ఒక్కసారిగా చిన్న సినిమాలు పొంగల్ రేస్‌లో రిలీజ్‌కు వస్తున్నాయి.

Read Also:BLN Reddy: ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్

వనంగన్, కాదలిక్కు నేరమిల్లై, టెన్ అవర్స్, పదవి తలైవన్, మద్రాస్ కారన్, తరుణం, సుమో వంటి సినిమాలు సంక్రాంతి రేసులో విడుదలకు రాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’కు తమిళ్‌లో మళ్లీ కష్టాలు మొదలయ్యాయంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తమిళ్‌లో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని వారు కోరుతున్నారు.

Show comments