NTV Telugu Site icon

Chandrababu Oath Taking Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు

Babu 2

Babu 2

Chandrababu Oath Taking Ceremony: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రేపు గన్నవరం ఐటీ పార్క్‌ దగ్గర.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. ఇక, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తుది దశకు చేరుకున్నాయి ఏర్పాట్లు.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు.. రేపు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు విజయవాడలో ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వీఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు.. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్, డీజీపీతో నిన్నే సమీక్ష జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

Read Also: Jaipur: రూ.300 విలువైన నకిలీ నగలను రూ.6కోట్లకు కొనుగోలు చేసిన అమెరికన్ మహిళ..

ఇక, వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరి మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేశరపల్లిలో కార్యక్రమం కావటంతో హైవే పై ఆంక్షలు విధించారు పోలీసులు.. ఇవాళ్లి సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. మరోవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.. సభా ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా.. సభా వేదికపై జరిగే కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా భారీ LED తెరలు ఏర్పాటు చేశారు.. పారిశుధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం వంటి ఏర్పాట్లను చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో.. 7 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: UGC: యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు..యూజీసీ సంచలన నిర్ణయం..

రేపు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో జరిగే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి.. పలువురు అతిథులు హాజరు కానున్నారు.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించారు.. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు..